Wednesday, April 04, 2007

Forgive Me..

Tuesday, November 14, 2006

ఇప్పటిదాకా...


ఇప్పటిదాకా నీతోనే మట్లాడుతున్నా,
నా చెవులకు నిశబ్ధమే కదా వాటికి నీ స్వరం వినిపించదు అంటే
ఇప్పటిదాకా నిన్నే చూస్తున్నా,
నా కంట కన్నీరు రాదా నువ్వు వాటికి కనిపించని క్షణం వస్తుంది అంటే
ఇప్పటిదాకా నీ చెంతనే వున్నా,
నా మనస్సున కలవరమే కదా దానిని నువ్వు వీడి వెల్తాను అంటే
ఇప్పటిదాకా సంతొషంగా వున్నా,
నాకు నరకమే కదా నీకు దూరంగా వుండాలి అంటే

నా కోసం, చిరకాలం నాతోనే నిలిచిపోవా నేస్తం...

Sunday, September 24, 2006

ఏమి చేసినా...

గుండెలో పలుకుని గొంతులోనే ఆపేసాను
నీపై ప్రేమను కన్నీటి వెనుక దాచేసాను
ఓపలేని బాధను చిరునవ్వుతో ముసేసాను
మన మధ్య వున్న దూరాన్ని మరపుతో మాపదలిచాను
నీడలాంటి ఙ్నాపకాలని నీ ధ్యాసతో గానీ శాంతింపచేయలేకున్నాను
ఇంత చేసినా నీకు చేరువ కాలేకున్నాను...

Monday, September 18, 2006

నేను నేనేనా? లేక నువ్వా?కన్నులు తెరిచి వున్నా, ఏమి చూస్తున్నా
ఆ కంటిపాప వెనుక కదిలే దృశ్యం నీ రూపం

చెవులు విప్పార్చినా, ఏమి వింటున్నా
ఆ శబ్ధాల వెనుక వినిపించే ధ్వని నీ స్వరం

చేతిలో కుంచె వున్నా, ఏమి గీసినా
ఆ గీతల వెనుక నిండివున్న భావం నీ ధ్యాస

పెదవులు పైన మాటలు, ఏమి పలికినా
ఆ నోటి చివర మెదిలే పదం నీ పేరు

పాదాల అడుగులు, ఎటు చేరాల్సినా
ఆ నడక తిరిగి చేరే గమ్యం నీ దరి

ఇలా నన్నునేనే గుర్తు చేసుకోవాల్సి వస్తుంటే..
నువ్వు నాలో నిండినట్లా? లేక నేను నీ ధ్యాసలో మునిగినట్లా?
నువ్వు నా చెంతనున్నట్లా? లేక నేను నా ప్రపంచమే నీతో నింపినట్లా?

ఇంతకీ నేను నేనేనా? లేక నువ్వా?
Tuesday, August 29, 2006

హృదయ తరంగాలు ...మనసులోని ప్రేమకి
మాటలతో ఆకారాన్ని ఇచ్చి
సిరాతో రంగులు దిద్ది
ముత్యాల్లా లేఖపై అతికించి
నీ చేతికి అందించాలా?

నా ఊపిరి నిండా నీ తలపులతో...

కనులు మూస్తే నీ రూపు చేరుకోగా...
నన్ను అల్లుకున్న స్వప్నం ఒక రంగుల హరివిల్లవ్వగా...

ఆ సుందర ప్రపంచంలో, మౌనమే మాటలుగా నిన్ను చేరును కదా...
నా హృదయ తరంగాలు ...

Wednesday, August 23, 2006

నీ ..

నిన్ను తలచుకున్న ప్రతిసారీ... నీ తలపులు అరుణోదయ కిరణాలుగా
నీ మాట విన్న ప్రతిసారీ... నీ పలుకులు వీణ మాధుర్యములుగా
నిన్ను చూసిన ప్రతిసారీ... నీ కన్నులు వీడలేని అయస్కాంతాలుగా
కలవరపడుతున్న నా హృదయాన్ని... ఏమిటి అని అడుగగా...

నా మౌనమే ఒక ఆలాపనగా... నీ మనసుతో చెబుతున్న భావమిది...

నీ చేతిలో చేయివేసి,అడుగులో అడుగేసి, నీలో నేనై జీవించాలని..

వేదన.. ఆవేదన

చేరలేని దరిని చేరుకోవాలన్న తపన,
చేరువలో వున్నా చెంత చేరలేని ఆవేదన,
చిరు గాలితో నైనా చిత్తగించలేని భావన,
చిన్న చుపుకైన నోచుకోలేనన్న చిత్రహింసతో..
చేయి జారిన మనసుకై చీకటిలొ వెతుకులాట.. చిత్రమే కదా...

రేపటి వెలుగుకి దారులు..

ఉపొంగే ఊహల అలలు, చేరేనా నీ ఎద తీరాలు...
కరిగే సుందర స్వప్నాలు, అయ్యేనా మన నుదుటి రాతలు...
పారే కంటి నీలాలు, మాన్పేనా నా ఎదలోని గాయలు...
అనుభవాల తీపి జ్ఞాపకాలు, చూపేనా రేపటి వెలుగుకి దారులు..

అందం... ఆనందం..

కళ్ళకి కాటుక అందం,
మనసుకి మాట అందం,
చెక్కిళ్ళకి సిగ్గు అందం,
పెదవులకు మౌనం అందం,
చేతికి గోరింటాకు అందం,
కాళ్ళకి పారాణి అందం...

అని ఎవరు చెప్పారు?

నీ చిటికిన వేలు పట్టుకొని,
ఏడు అడుగులు నడుస్తున్న సమయం,
యదలో పొంగే కెరటాలతో,
బుగ్గలో మొగ్గలు విరియగా,
అధరాల పైన చిరు నవ్వుతో,
కళ్ళళ్ళో మెరిసే మెరుపు కదా...

అసలైన అందం... ఆనందం..