నేను నేనేనా? లేక నువ్వా?

కన్నులు తెరిచి వున్నా, ఏమి చూస్తున్నా
ఆ కంటిపాప వెనుక కదిలే దృశ్యం నీ రూపం
చెవులు విప్పార్చినా, ఏమి వింటున్నా
ఆ శబ్ధాల వెనుక వినిపించే ధ్వని నీ స్వరం
చేతిలో కుంచె వున్నా, ఏమి గీసినా
ఆ గీతల వెనుక నిండివున్న భావం నీ ధ్యాస
పెదవులు పైన మాటలు, ఏమి పలికినా
ఆ నోటి చివర మెదిలే పదం నీ పేరు
పాదాల అడుగులు, ఎటు చేరాల్సినా
ఆ నడక తిరిగి చేరే గమ్యం నీ దరి
ఇలా నన్నునేనే గుర్తు చేసుకోవాల్సి వస్తుంటే..
నువ్వు నాలో నిండినట్లా? లేక నేను నీ ధ్యాసలో మునిగినట్లా?
నువ్వు నా చెంతనున్నట్లా? లేక నేను నా ప్రపంచమే నీతో నింపినట్లా?
ఇంతకీ నేను నేనేనా? లేక నువ్వా?

2 Comments:
nuvvu nuvvu kaani vela
nuvvu verevarigano maripoyina veela
bhaavam bhasha ayina vela
manasu maayamainatte
preema needaynatte
geetala venuka nimdivunna bhaavam nii dyaasa ...
chalaa bagumdandi ee bhaavana
బాగుంది :-)
సీతారామశాస్త్రి గారి పాట "ఎక్కడ ఉన్నా పక్కన నువ్వే ఉన్నట్టుంటుంది" గుర్తుకు వచ్చింది.
Post a Comment
<< Home