Tuesday, August 29, 2006

హృదయ తరంగాలు ...మనసులోని ప్రేమకి
మాటలతో ఆకారాన్ని ఇచ్చి
సిరాతో రంగులు దిద్ది
ముత్యాల్లా లేఖపై అతికించి
నీ చేతికి అందించాలా?

నా ఊపిరి నిండా నీ తలపులతో...

కనులు మూస్తే నీ రూపు చేరుకోగా...
నన్ను అల్లుకున్న స్వప్నం ఒక రంగుల హరివిల్లవ్వగా...

ఆ సుందర ప్రపంచంలో, మౌనమే మాటలుగా నిన్ను చేరును కదా...
నా హృదయ తరంగాలు ...

Wednesday, August 23, 2006

నీ ..

నిన్ను తలచుకున్న ప్రతిసారీ... నీ తలపులు అరుణోదయ కిరణాలుగా
నీ మాట విన్న ప్రతిసారీ... నీ పలుకులు వీణ మాధుర్యములుగా
నిన్ను చూసిన ప్రతిసారీ... నీ కన్నులు వీడలేని అయస్కాంతాలుగా
కలవరపడుతున్న నా హృదయాన్ని... ఏమిటి అని అడుగగా...

నా మౌనమే ఒక ఆలాపనగా... నీ మనసుతో చెబుతున్న భావమిది...

నీ చేతిలో చేయివేసి,అడుగులో అడుగేసి, నీలో నేనై జీవించాలని..

వేదన.. ఆవేదన

చేరలేని దరిని చేరుకోవాలన్న తపన,
చేరువలో వున్నా చెంత చేరలేని ఆవేదన,
చిరు గాలితో నైనా చిత్తగించలేని భావన,
చిన్న చుపుకైన నోచుకోలేనన్న చిత్రహింసతో..
చేయి జారిన మనసుకై చీకటిలొ వెతుకులాట.. చిత్రమే కదా...

రేపటి వెలుగుకి దారులు..

ఉపొంగే ఊహల అలలు, చేరేనా నీ ఎద తీరాలు...
కరిగే సుందర స్వప్నాలు, అయ్యేనా మన నుదుటి రాతలు...
పారే కంటి నీలాలు, మాన్పేనా నా ఎదలోని గాయలు...
అనుభవాల తీపి జ్ఞాపకాలు, చూపేనా రేపటి వెలుగుకి దారులు..

అందం... ఆనందం..

కళ్ళకి కాటుక అందం,
మనసుకి మాట అందం,
చెక్కిళ్ళకి సిగ్గు అందం,
పెదవులకు మౌనం అందం,
చేతికి గోరింటాకు అందం,
కాళ్ళకి పారాణి అందం...

అని ఎవరు చెప్పారు?

నీ చిటికిన వేలు పట్టుకొని,
ఏడు అడుగులు నడుస్తున్న సమయం,
యదలో పొంగే కెరటాలతో,
బుగ్గలో మొగ్గలు విరియగా,
అధరాల పైన చిరు నవ్వుతో,
కళ్ళళ్ళో మెరిసే మెరుపు కదా...

అసలైన అందం... ఆనందం..