Sunday, September 24, 2006

ఏమి చేసినా...

గుండెలో పలుకుని గొంతులోనే ఆపేసాను
నీపై ప్రేమను కన్నీటి వెనుక దాచేసాను
ఓపలేని బాధను చిరునవ్వుతో ముసేసాను
మన మధ్య వున్న దూరాన్ని మరపుతో మాపదలిచాను
నీడలాంటి ఙ్నాపకాలని నీ ధ్యాసతో గానీ శాంతింపచేయలేకున్నాను
ఇంత చేసినా నీకు చేరువ కాలేకున్నాను...

Monday, September 18, 2006

నేను నేనేనా? లేక నువ్వా?కన్నులు తెరిచి వున్నా, ఏమి చూస్తున్నా
ఆ కంటిపాప వెనుక కదిలే దృశ్యం నీ రూపం

చెవులు విప్పార్చినా, ఏమి వింటున్నా
ఆ శబ్ధాల వెనుక వినిపించే ధ్వని నీ స్వరం

చేతిలో కుంచె వున్నా, ఏమి గీసినా
ఆ గీతల వెనుక నిండివున్న భావం నీ ధ్యాస

పెదవులు పైన మాటలు, ఏమి పలికినా
ఆ నోటి చివర మెదిలే పదం నీ పేరు

పాదాల అడుగులు, ఎటు చేరాల్సినా
ఆ నడక తిరిగి చేరే గమ్యం నీ దరి

ఇలా నన్నునేనే గుర్తు చేసుకోవాల్సి వస్తుంటే..
నువ్వు నాలో నిండినట్లా? లేక నేను నీ ధ్యాసలో మునిగినట్లా?
నువ్వు నా చెంతనున్నట్లా? లేక నేను నా ప్రపంచమే నీతో నింపినట్లా?

ఇంతకీ నేను నేనేనా? లేక నువ్వా?